వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022.. మూడో స్థానంలో సౌదీ
- August 21, 2022
రియాద్: అంతర్జాతీయ వలసదారులకు సౌదీ అరేబియా మూడవ అగ్ర గమ్యస్థానంగా ఉంది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022 ప్రకారం.. సౌదీలో 13.5 మిలియన్ల ప్రవాసులు ఉన్నారు. 1970 నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ వలసదారులకు ప్రధాన గమ్యస్థానంగా ఉందని నివేదిక చూపించింది. 1970లో 12 మిలియన్లు ఉన్న వలసదారుల సంఖ్య 2019 నాటికి 50.6 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. ఇక రెండవ స్థానంలో ఉన్న జర్మనీలో 2000లో 8.9 మిలియన్ల వలసదారులు ఉండగా.. 2020 నాటికి దాదాపు 16 మిలియన్లకు పెరిగిందని నివేదిక పేర్కొంది. సౌదీ అరేబియా తర్వాత స్థానాల్లో రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా ఉన్నాయి. 2030 నాటికి సౌదీ అరేబియా రాజ్య జనాభా 50 మిలియన్లకు చేరుకుంటుందని, అందులో 25 మిలియన్ల ప్రవాసులు ఉంటారని క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ గతంలో తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







