కువైట్ విమానాశ్రయానికి భారీగా పెరిగిన ప్రయాణికుల తాకిడి..
- August 21, 2022
కువైట్ సిటీ: వేసవి సెలవులు ముగియడంతో పాటు విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విహారయాత్రలకు, స్వదేశానికి వెళ్లిన ప్రవాసులు తిరిగి కువైట్ చేరుకుంటున్నారు.దీంతో గడిచిన రెండు రోజులుగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది.ఈ రెండు రోజుల్లో బయటి దేశాల నుంచి కువైట్ ఎవిమానాశ్రయానికి ఏకంగా 340కి పైగా విమానాలు వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.ఇందులో ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, దుబాయ్ నుంచి అధిక సంఖ్యలో విమానాలు విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలిపారు.ఇలా రోజుకు కనీసం 25వేల నుంచి 30వేల వరకు ప్రయాణికులు ఇతర దేశాల నుంచి కువైట్ ఎయిర్‌పోర్టుకు వచ్చారని అధికారులు పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







