సల్లూ భాయ్‌ని ఆ హీరోయిన్ అంత మాట అనేసిందా.?
- August 21, 2022
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన సల్లూ భాయ్ లైఫ్‌లో అమ్మాయిల లిస్టు చాలా పెద్దదే. సల్లూ భాయ్ ప్రేమలో నలిగిపోయిన ముద్దుగుమ్మలు చాలా మందే వున్నారు. అదేంటో, సల్లూ భాయ్‌తో ప్రేమను ఎక్కువ కాలం ఎంజాయ్ చేయలేరు అందాల భామలు.
అలా ఐశ్వర్య రాయ్ దగ్గర్నుంచీ కత్రినా కైఫ్ వరకూ చాలా మంది అందగత్తెలు సల్మాన్ ఖాన్ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లలేకపోయారు. అసలు సల్లూ భాయ్ ప్రేమ విషయం ఎందుకొచ్చిందంటారా.? ఆయన లవ్వు లిస్టులోని ఓ మాజీ లవర్ ఆయనపై ఘాటైన విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది.
బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ఆ ముద్దుగుమ్మ పేరు సోమీ అలీ. గతంలో సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమాలో నటించాల్సి వుందట సోమీ. అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆ సినిమా ఆగిపోయిందట. ఆ టైమ్‌లోనే ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమ యవ్వారం సాగించారట.
అదంతా గతం. అయితే, ఇన్నేళ్ల తర్వాత ఈమెకి ఇప్పుడెందుకు సల్లూ భాయ్ మంచోడు కాదని తెలిసిందో ఏమో కానీ, ఆయన శాడిస్ట్, అమ్మాయిల్ని కొడతాడు.. నాతో పాటూ చాలా మందిని కొట్టేవాడు.. ఆయన్ని అభిమానించడం మానేయండి..’ అంటూ రకరకాల ఆరోపణలు చేస్తూ ట్వీట్ల వర్షం కురిపించింది.
ఈ ట్వీట్లకు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్







