గాడ్ ఫాదర్ టీజర్ విడుదల
- August 21, 2022
గాడ్ ఫాదర్ టీజర్ రిలీజ్..
హైదరాబాద్: రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్బంగా మెగా టీజర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో మెగా సంబరాలు నింపారు. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడం తో మేకర్స్ ప్రమోషన్ ఫై దృష్టి పెంచారు. ఈ తరుణంలో రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా టీజర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో సంబరాలు నింపారు.
మురళీ శర్మ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలవ్వగా..మెగాస్టార్ వాయిస్ తో ముగుస్తుంది. 20 ఏళ్లు ఎక్కడికెళ్లాడో ఎవరికీ తెలీదు. సడెన్ గా తిరిగొచ్చిన ఆరేళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు` అని రాహుల్ శర్మ అంటారు.ఇక్కడికి ఎరొచ్చినా? రాకపోయినా? నేను పట్టించుకోను. కానీ అతను మాత్రం రాకూడదంటూనయన్ ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. `డూ యూ నో హూ ఈజ్`..హీ ఈజ్ ద బాస్ ఆఫ్ ది బాసెస్..అవర్ ఒన్ అండ్ ఓన్లీ గాడ్ ఫాదర్అంటూ టీజర్ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ హైలైట్.లప్తా బడీ రౌడీ ప్లానింగ్ చల్ రఈయే.. అప్నే చోటీ భాయ్ కో బోల్ నా నయియే` అంటూ మెగాస్టార్ చెప్పిన హిందీ డైలాగ్ తో ఫ్యాన్స్ లో పునకాలు తెప్పించడం ఖాయం.
మెగాస్టార్ మాసివ్ ఎంట్రీ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. టీజర్ తోనే అంచనాలు రెట్టింపు చేసారు. చిరు ఎంట్రీ నుంచి టీజర్ ముగింపులో సల్మాన్ ఎంట్రీ వరకూ ఆద్యంతం రక్తి కట్టించింది. సల్మాన్ గెస్ట్ అప్పీరియన్స్ ని సైతం టీజర్ లో రివీల్ చేసారు.
అయితే ఈ టీజర్ ఫై సోషల్ మీడియా లో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. చిరంజీవి క్యాస్టూమ్స్, డ్రెస్సుల మీద జోకులు పడుతున్నాయి. చిరంజీవి లుక్ కూడా అంతగా సెట్ అవ్వలేదు. ఇక సల్మాన్ ఖాన్ చివర్లో కనిపించడం, ఆ కనిపించిన తీరు మీదా విమర్శలు వినిపిస్తున్నాయి. చిరంజీవి పక్కన ఉంటే.. సల్మాన్ ఖాన్ జీపు డ్రైవ్ చేస్తుంటాడు. మీకు పర్ఫెక్ట్ డ్రైవర్ దొరికాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలాగే టీజర్ బ్యాక్ గ్రౌండ్ అంత కూడా గని బ్యాక్ గ్రౌండ్ ను వాడాడు థమన్ అని కామెంట్స్ వేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







