అదాన్‌ ఆస్పత్రిలో మంకీపాక్స్ కేసు.. పుకార్లను ఖండించిన వైద్యులు

- August 22, 2022 , by Maagulf
అదాన్‌ ఆస్పత్రిలో మంకీపాక్స్ కేసు.. పుకార్లను ఖండించిన వైద్యులు

కువైట్ సిటీ: అదాన్ హాస్పిటల్‌లో మంకీపాక్స్ వ్యాధి కేసు నమోదైందన్న పుకార్లను అహ్మదీ హెల్త్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ అహ్మద్ అల్-షట్టి తీవ్రంగా ఖండించారు. కొన్ని రోజుల క్రితం బోస్నియా నుండి వచ్చిన ఒక కువైట్ చిన్నారికి మంకీపాక్స్ వైరస్ సోకిందనే అనుమానంతో అదాన్ హాస్పిటల్‌లోని వైద్య నిపుణులు పర్యవేక్షించారని అల్-షట్టి వెల్లడించారు.చిన్నారికి చికిత్స అందిస్తున్న వైద్యులకు మంకీపాక్స్ లక్షణాలు కనిపించకపోయినప్పటికీ, ముందుజాగ్రత్తగా బిడ్డను కమ్యూనికేబుల్ డిసీజెస్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వివరించారు. ఆ పిల్లాడికి మంకీపాక్స్ లక్షణాలు లేవని, వాతావరణ మార్పుల వల్ల లేదా కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల అతను దద్దుర్లతో బాధపడుతున్నాడని పరీక్షలలో తేలిందన్నారు. ఆసుపత్రిలోని పబ్లిక్ హెల్త్, ప్రైమరీ హెల్త్ కేర్, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ విభాగాల సమన్వయంతో మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని, ఎపిడెమియోలాజికల్ పరిస్థితి స్థిరంగా ఉందని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com