కాగిత రహిత లావాదేవీలను పెంచేందుకు ఆటోమేటెడ్ సిస్టమ్‌

- August 26, 2022 , by Maagulf
కాగిత రహిత లావాదేవీలను పెంచేందుకు ఆటోమేటెడ్ సిస్టమ్‌

దుబాయ్: అధునాతన సాంకేతికతను ఉపయోగించి కాగిత రహిత లావాదేవీలను పెంచడానికి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) కియోలిస్-MHI (దుబాయ్ మెట్రో మరియు ట్రామ్ ఆపరేటర్)తో భాగస్వామ్యం కుదుర్చుకుని రైల్ ఆటోమేటెడ్ సిస్టమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 

మెట్రో/ట్రామ్, దుబాయ్ మెట్రో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్, దుబాయ్ ట్రామ్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్, ఎన్విరాన్‌మెంట్ - మేనేజ్‌మెంట్ ఆఫ్ పవర్/ఎనర్జీ/వేస్ట్ మరియు ఇతర వాటిపై జరిగే భారీ-స్థాయి  కార్యకలాపాలకు యాక్సెస్ కు ఈ సిస్టమ్ అనుమతిస్తుంది.

రవాణా వ్యవస్థ పని తీరు మెరుగు పరిచే విధంగా పయనిస్తున్న RTA సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అధికారిక సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com