ఈ వారాంతంలో దుబాయ్ మెట్రో ఉచిత రైడ్

- August 27, 2022 , by Maagulf
ఈ వారాంతంలో దుబాయ్ మెట్రో ఉచిత రైడ్

దుబాయ్: దుబాయ్ మెట్రో సేవలను ఈ వారాంతంలో రెండు గంటల పాటు పొడిగిస్తున్నట్లు దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) శుక్రవారం ప్రకటించింది. ఆగస్టు 27, 28 తేదీల్లో అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలను పొడిగించనున్నట్లు అధికార యంత్రాంగం ఈ మేరకు ట్వీట్ చేసింది.ఈ సమయాల్లో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుండి సెంటర్‌పాయింట్ మెట్రో స్టేషన్‌కు ప్రయాణీకులు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. వేసవి సెలవులు, పాఠశాలలకు సెలవులు ముగియడం వల్ల విమానాశ్రయం నుండి ట్రాన్స్ పోర్ట్ కోసం అధిక డిమాండ్ ఉన్నందున ఈ చర్య తీసుకున్నట్లు RTA ప్రతినిధి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com