జి-20 సమావేశానికి ఒమన్‌ను ఆహ్వానించిన భారత్
- September 18, 2022
మస్కట్: G-20 సమ్మిట్, సమావేశాలలో అతిథి దేశంగా ఒమన్ పాల్గొననుంది. ఈ మేరకు ఒమన్‌కు భారతదేశం ప్రత్యేక ఆహ్వానాన్ని అందించింది. న్యూఢిల్లీలో 2023 సెప్టెంబర్ 9, 10 తేదీలలో G-20 దేశాధినేతల సమ్మిట్ జరుగనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, సింగపూర్, స్పెయిన్, యూఏఈ దేశాలను భారత్ ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా సుల్తానేట్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ అమిత్ నారంగ్ మాట్లాడుతూ.. జి-20 అధ్యక్షుడి హోదాలో ఉన్న భారత్.. అతిథి దేశంగా ఒమన్‌ను ఆహ్వానించడం రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక స్నేహానికి ప్రతీక అన్నారు. ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ GDPలో దాదాపు 85 శాతం వాటాను G-20 కూటమి కలిగి ఉందన్నారు. ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ప్రీమియర్ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరమ్‌లో పాల్గొనడానికి సుల్తానేట్‌కు ఇది ఒక మంచి అవకాశం అని నారంగ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







