కింగ్ చార్లెస్ IIIకు అభినందనలు తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
- September 18, 2022
అబుధాబి: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, నార్తర్న్ ఐర్లాండ్ రాజు చార్లెస్ IIIకి ఫోన్ చేసి మాట్లాడారు. దివంగత క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత రాజుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలిపారు. క్వీన్ ఎలిజబెత్ II అడుగుజాడల్లో నడవాలని, రాజుగా విధులు నిర్వహించడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. చార్లెస్ III హయాంలో యునైటెడ్ కింగ్డమ్, అక్కడి ప్రజలు మరింత అభివృద్ధి సాధించాలని యూఏఈ అధ్యక్షుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్‌కు కింగ్ చార్లెస్ III ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







