ఫిఫా వరల్డ్ కప్ కోసం వచ్చే విదేశీ అభిమానుల కోసం ప్రత్యేకంగా హయ్య కార్డ్

- September 19, 2022 , by Maagulf
ఫిఫా వరల్డ్ కప్ కోసం వచ్చే విదేశీ అభిమానుల కోసం ప్రత్యేకంగా హయ్య కార్డ్

ఖతార్ :  ఫిఫా వరల్డ్ కప్ 2022 కు ఈ సారి ఖతార్ అతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఖతార్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అదే విధంగా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను చూసేందుకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు రానున్నారు. వారి కోసం ప్రభుత్వం నియమించిన సుప్రీం కమిటీ "హయ్య కార్డ్ " లను ప్రవేశ పెట్టింది. ఈ కార్డు తీసుకున్న ఫ్యాన్స్ కు చాలా బెనిఫిట్స్ ఉంటాయని సుప్రీం కమిటీ తెలిపింది. రిజిస్ట్రేషన్, అకామిడేషన్, లోకల్ లో జర్నీ సహా వారికి కావాల్సిన అన్ని విధాల సపోర్ట్ ను కార్డు ఉన్న వారికి అందించనున్నారు. ఇందుకు సంబంధించి విదేశీ అభిమానులకు సమాచారం అందించేందుకు నేటి నుంచి సుప్రీం కమిటీ ఆధ్వర్యంలోని డెలవరీ అండ్ లెగసీ టీమ్ వెబ్ నార్ లు నిర్వహించనుంది. ఈ వెబ్ నార్ లో "హయ్య కార్డ్" తీసుకుంటే ఉండే ప్రయోజనాలను వివరించనున్నారు. ఇంగ్లీష్, అరబ్ భాషలో వెబ్ నార్ లు నిర్వహిస్తున్నారు. "హయ్య కార్డ్ "ను ఫుట్ టోర్నమెంట్ చూసేందుకు వచ్చే విదేశీ అభిమానులకు తప్పనిసరి చేశారు. ఇప్పటికే వేలాది మంది కార్డ్ కోసం అప్లయ్ చేసుకున్నారని హయ్య కార్డ్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలిపారు. హయ్య కార్డ్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం - [email protected] మెయిల్ కు గానీ  లేదంటే  (+974) 4441 2022 నంబర్ గానీ ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ కాల్ చేయవచ్చు. 

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com