ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్. దుబాయ్ ఆర్టీఏకు కాసుల పంట

- September 19, 2022 , by Maagulf
ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్. దుబాయ్ ఆర్టీఏకు కాసుల పంట

దుబాయ్ : చాలా మంది సంపన్నులకు తమ వాహనం నంబర్ కు సంబంధించి ఉండే సెంటిమెంట్ అంతా, ఇంతా కాదు. అదే విధంగా చాలా మందికి ఫ్యాన్సీ నంబర్లంటే మామూలు క్రేజ్ ఉండదు. తమకు నచ్చిన నంబర్ కోసం వారు ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వారి క్రేజే దుబాయ్ ఆర్టీఏ కు కాసుల పంట పండిస్తోంది. తాజాగా 90 ఫ్యాన్సీ నంబర్లకు దుబాయ్ ఆర్టీఏ వేలం నిర్వహించగా దీని ద్వారా ఏకంగా 37 మిలియన్ల దిర్హామ్స్ ఆదాయం వచ్చింది.  AA-13 అనే నంబర్ ఏకంగా 4.42 మిలియన్ల దిర్హామ్స్ పలికింది. అత్యధిక ధరకు దుబాయ్ లోని ఓ వ్యక్తి ఈ నంబర్ ను సొంతం చేసుకున్నాడు.  U-70 అనే నంబర్ కు 3 మిలియన్ దిర్హామ్స్, Z-1000 అనే నంబర్ కు 2.21 మిలియన్ దిర్హామ్స్, V-99999 నంబర్ కోసం 1.26 మిలియన్ దిర్హామ్స్ వచ్చాయి. మొత్తంగా 37 మిలియన్ దిర్హామ్స్ వేలం పాట ద్వారా ఆదాయం వచ్చినట్లు ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ ఉన్నప్పటికీ దుబాయ్ లోనే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10 అత్యధిక రేటు పలికిన ఫ్యాన్సీ నంబర్లలో 8 దుబాయ్ లోనే ఉంటాయంటే ఇక్కడ ఫ్యాన్సీ నంబర్లకు ఉండే క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అటు ఈ ఏడాది జనవరిలో ఓ ఛారిటీ కోసం జరిగిన వేలం AA8 అనే నంబర్ 35 మిలియన్ దిర్హామ్స్ ధర పలికింది. ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన మూడో ఖరీదైన నంబర్ ప్లేట్ గా ఇది నిలవటం విశేషం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com