ఇండియాకు వెళ్తున్నారా.. మాస్క్ తప్పనిసరి
- September 28, 2022
యూఏఈ: కొవిడ్ భద్రతా చర్యలలో యూఏఈ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. వైద్య సదుపాయాలు, మస్జీదులు, ప్రజా రవాణా మార్గాలు మినహా యూఏఈలోని అన్ని బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించడం ఐచ్ఛికం చేశారు. ఈ క్రమంలో దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్ కొత్త మాస్క్ మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి. రెండు విమానయాన సంస్థలు దుబాయ్ నుండి ప్రయాణించే లేదా దుబాయ్ గుండా ప్రయాణించే ప్రయాణీకులను వారి స్వదేశంలోని మాస్క్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నాయి. విమానాల లోపల మాస్క్ ధరించడం ఇకపై తప్పనిసరి కాకున్నా.. విమానయాన సంస్థలు ఈ నిబంధనను అమలు చేయవచ్చని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రయాణీకులు భారత ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి