ఖైతాన్‌లో ఓ ఈజిప్షియన్ దారుణ హత్య
- October 01, 2022
కువైట్: ఖైతాన్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఒక గుర్తుతెలియని ఈజిప్షియన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపార్ట్మెంట్లోని తెరిచి ఉన్న ఓ ప్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించారని క్రిమినల్ ఎవిడెన్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. ప్లాట్ లో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించారు. అతన్నిఈజిప్షియన్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బలమైన వస్తువుతో కొట్టడంతో అతడు చనిపోయినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు వీలుగా అతడి మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD







