చిన్న సినిమానే అయినా ‘స్వాతిముత్య’మే.!
- October 06, 2022
ఓ చిలిపి కథతో చిన్న హీరో బెల్లంకొండ గణేష్ ఈ దసరా పండగకి పెద్ద సాహసం చేశాడు. అదీ తొలి సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందిన సినిమా కావడంతో, ధైర్యంగా ఈ సినిమా పెద్ద సినిమాలతో పోటీగా బరిలో దించేశారు.
అవును నిజమే, బ్యానర్‌కి వున్న పాపులారిటీ ఒకింత బాగానే పనికొచ్చింది. అలాగే, పండక్కి సరద సరదాగా సాగిపోయే కథా, కథనం కావడంతో, ఓకే, ‘స్వాతిముత్యం’ కూడా తన వంతుగా ఫర్లేదనిపించాడు.
స్నేహితుల బలవంతంతో వీర్యదానం చేసిన హీరో ఎలా ఇరకాటంలో పడ్డాడనేదే ఈ సినిమా కథ. తొలి సినిమానే అయినా బెల్లంకొండ గణేష్ బాగానే తన పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్ వర్ష బొల్లమ్మకు ఆల్రెడీ పలు చిత్రాల్లో నటించిన అనుభవం వుంది. ఆ అనుభవంతో తన పాత్రకు తానూ హండ్రెడ్ పర్సంట్ న్యాయం చేసేసింది.
ఇక సపోర్టింగ్ రోల్స్‌లో రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల్ని కట్టి పడేశారు. నటీనటులను ఎక్కువగా కష్టపెట్టకుండా, తాను అనుకున్న కథని, సింపుల్ సినారియోలో కథకి అవసరమైనంత కామెడీ డోస్ జోడించి నడిపించిన విధానం బాగుంది.
సో, ‘స్వాతి ముత్యం’ సినిమా జస్ట్ టైమ్ పాస్ సినిమాగా తన ప్లేస్ తానూ దక్కించుకుంది పండగ సీజన్లో. నో ప్రాబ్లెమ్.. దసరా హాలీడే సీజన్ ఇంకా ముగిసిపోలేదు కాబట్టి, తన వంతుగా ఈ చిన్న సినిమా కూడా సత్తా చాటగల సామర్ధ్యం లేకపోలేదు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







