గాడ్ ఫాదర్‌ని లైట్ తీసుకున్న రంగమ్మత్త.! ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.!
- October 06, 2022
మెగా ఫ్యాన్స్‌కి అనసూయ భరద్వాజ్ టార్గెట్ అయ్యింది. ఏదో ఒక విషయంపై కెలుక్కుని మరీ కామెంట్ చేయించుకునే రకం అనసూయ. తద్వారా వచ్చే పబ్లిసిటీని తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. తాజాగా మరోసారి అనసూయ సోషల్ మీడియా ట్రోలింగ్‌కి గురైంది.
అందుకు కారణం, ‘గాడ్ ఫాదర్’ మూవీ. ఇటీవల సినిమాలతో బిజీ అయిపోయి, బుల్లితెర జబర్దస్త్ షోకి సైతం అనసూయ గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. మొదట్లో సెలెక్టివ్‌గా సినిమాలు చేసే అనసూయ, ఇప్పుడు ఏది పడితే అది చేసేస్తూ, ఏ సినిమాలో నటిస్తోందో తెలియకుండా పోయింది.
‘గాడ్ ఫాదర్’ సినిమాలోనూ అనసూయ నటించేసిందండోయ్. ఓ జర్నలిస్టు పాత్రలో అనసూయ కనిపించింది. సినిమా రిలీజయ్యాకే ఈ విషయం తెలిసింది. చిన్న పాత్రే అయినా, తాను కూడా సినిమాలో భాగం అయినందుకు ఓ చిన్న ట్వీటో, గీటో వేసుకోవచ్చుగా. ఏం మరీ అంత పొగరు పెరిగిపోయిందా.? అనసూయా.? అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
అనవసరమైన ఇష్యూస్‌లో దూరి కెలుక్కునే అనసూయ, ‘గాడ్ ఫాదర్’ వంటి పెద్ద సినిమాలో నటించినప్పుడు ఆ సినిమా గురించి ఓ చిన్న ట్వీట్ కూడా వేయకపోవడం సబబు కాని అంశమే. సో, ఫ్యాన్స్‌కి టార్గెట్ అవ్వడంలో ఏం తప్పు లేదు. అయితే, ఇదే విషయంపై తాజాగా స్పందించిన అనసూయ, కాస్త బిజీగా వుండడం వల్ల ట్వీట్ చేయలేకపోయానని సమాధానమిచ్చింది.
మరదే.! చిరంజీవి సినిమాని మించిన బిజీ ఏముందంటూ, మళ్లీ ఆడేసుకుంటున్నారు రంగమ్మత్తని. అయినా, ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వడం కానీ, అనసూయ ట్వీట్ వేయకపోతే ‘గాడ్ ఫాదర్’కి వచ్చిన నష్టమేంటబ్బా.! అంతేగా. అంతేగా.!
తాజా వార్తలు
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం







