ట్రెండ్ సృష్టిస్తోన్న శ్రీ లీల.! సందడి మామూలుగా లేదుగా.!

- October 06, 2022 , by Maagulf
ట్రెండ్ సృష్టిస్తోన్న శ్రీ లీల.! సందడి మామూలుగా లేదుగా.!

‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ కస్తూరి శ్రీ లీల. తొలి సినిమా ఫెయిల్యూర్ అయ్యింది. అయినా కానీ, ఈ అమ్మడు క్రేజ్ దక్కించుకుంది. తొలి సినిమా ఫెయిలైనా, శ్రీ లీల తెలుగు ఆడియన్స్‌ని కట్టిపడేసిన వైనం, మేకర్లనూ ఇంప్రెస్ చేసింది.
దాంతో వరుస ఆఫర్లు కట్టబెడుతున్నారీ ముద్దుగుమ్మకి. ప్రస్తుతం ‘ధమాకా’ సినిమాలో నటిస్తోంది శ్రీ లీల. మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది.
ఆ సంగతి అటుంచితే, శ్రీలీల చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్టులున్నాయ్ తెలుగులో. అందులో ఒకటి బోయపాటి సినిమా కూడా కావడం విశేషం. బోయపాటి శీను డైరెక్షన్‌లో రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న సినిమాలో శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది.
అలాగే, క్రేజీ యంగ్ హీరో ‘జాతిరత్నాలు’తో సూపర్ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాలో శ్రీ లీల నటిస్తోంది. అన్నింటికీ మించి నందమూరి నటసింహం బాలయ్య సినిమాలో శ్రీ లీలకు ఛాన్స్ దక్కడం ఆషా మాషీ విషయం కాదు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న బాలయ్య సినిమాలో శ్రీ లీల, బాలయ్యకు కూతురుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 
వీటితో పాటూ, కన్నడలోనూ పలు ప్రాజెక్టులతో శ్రీలీల బిజీగా గడుపుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com