ప్రపంచంలోని సురక్షితమైన దేశాలలో ఒకటిగా బహ్రెయిన్

- October 07, 2022 , by Maagulf
ప్రపంచంలోని సురక్షితమైన దేశాలలో ఒకటిగా బహ్రెయిన్

బహ్రెయిన్: ప్రపంచంలోని సురక్షితమైన దేశాలలో ఒకటిగా బహ్రెయిన్ నిలిచింది. విపత్తు సంసిద్ధత విషయంలో బహ్రెయిన్ మొత్తం 0.95 స్కోరుతో ప్రపంచ దేశాలలో పదవ స్థానంలో నిలిచింది. బాండీస్ ఎన్ట్విక్లాంగ్ హిఫ్ల్ట్(Bundnis Entwicklung Hilft), ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ లా ఆఫ్ పీస్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ రూహ్ర్ యూనివర్శిటీ బోచుమ్ ద్వారా ఈ వరల్డ్ రిస్క్ ఇండెక్స్‌(WRI) నివేదికను ప్రచురించింది. మొత్తం 193 దేశాలలో అతి తక్కువ ప్రమాదాలు గల దేశంగా కింగ్‌డమ్‌ 184 ర్యాంకులో ఉన్నది. భూకంపాలు లేదా తుఫానుల వంటి సహజ ప్రమాదాలకు ప్రతిస్పందించే సహజ సామర్థ్యం ఆధారంగా ఆయా దేశాలకు ర్యాంకులను కేటాయిస్తారు. ఇక నివేదిక ప్రకారం.. అత్యధిక విపత్తు ప్రమాదం ఉన్న దేశాల జాబితాలో ఫిలిప్పీన్స్, ఇండియా, ఇండోనేషియా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com