మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజున దుబాయ్‌లో ఉచిత పార్కింగ్
- October 07, 2022
దుబాయ్: మొహమ్మద్ ప్రవక్త (స) జన్మదినం సందర్భంగా అక్టోబర్ 8న(శనివారం) బహుళ-స్థాయి టెర్మినల్స్ మినహా దుబాయ్‌లోని అన్ని పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించనున్నారు. ఈ మేరకు దుబాయ్ ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. మొహమ్మద్ ప్రవక్త (స) జన్మదినం సందర్భంగా వాహనదారులకు ఉచిత టోల్, పార్కింగ్ సదుపాయాన్ని అబుధాబిలో ప్రకటించింది. షార్జా కూడా చాలా ప్రాంతాల్లో ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని వాహనదారులకు కల్పించింది. చాలా ఇస్లామిక్ దేశాల్లో ముహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు 12 రబీ అల్-అవ్వల్ 1444న జరుపుకుంటారు. ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో మూడవ నెల. యూఏఈలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులందరికీ అధికారికంగా శనివారం అక్టోబర్ 8న పెయిడ్ హాలిడేగా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







