సీబ్‌లో 225 కిలోల కలుషిత ఆహారం ధ్వంసం
- October 07, 2022
మస్కట్: సీబ్‌లోని 211 కేఫ్‌లు, రెస్టారెంట్‌లలో మస్కట్ మునిసిపాలిటీ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని 10 రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు మునిసిపాలిటీ తెలిపింది. దీంతోపాటు తినేందుకు పనికిరాని 225.6 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. పబ్లిక్ హెల్త్ నిబంధనలను కేఫ్ లు, రెస్టారెంట్లు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఉపరితలాలను తరచుగా క్రిమిసంహారక చేయడం, సరైన వెంటిలేషన్‌ను కల్పించడం, ప్రతి కార్మికుడు/ఉద్యోగికి తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించాలని సూచించింది. నిబంధనలు పాటించని వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మస్కట్ మున్సిపాలిటీ హెచ్చరించింది. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఏదైనా నిబంధల ఉల్లంఘనలు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1111కి కాల్ చేసి చేప్పాలని కోరింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







