అమెరికాలో కిడ్నాప్కి గురైన సౌదీకి చెందిన వ్యక్తి
- April 20, 2016
అమెరికాలోని ఓహియోలోని క్వీవ్లాండ్ పోలీసులు, ఓ వ్యక్తిని పార్కింగ్ లాట్లో గుర్తించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ వ్యక్తి కిడ్నాప్కి గురైనట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసి, అతన్ని దోచుకున్న అనంతరం, తీవ్రంగా గాయపర్చి పార్కింగ్ లాట్లో పడేశారని పోలీసులు చెప్పారు. పోలీసులు విచారణను వేగవంతం చేశారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఆ వ్యక్తి డౌన్టౌన్ హోటల్లో నివసిస్తున్నాడని పోలీసులు వివరించారు. ఇద్దరు వ్యక్తులు హోటల్ నుంచి తన తండ్రిని తీసుకువెళ్ళినట్లు బాధితుడి కుమార్తె చెప్పారు. బాధితుడి దగ్గర్నుంచి సెల్ఫోన్, కొంత సొమ్ముని దొంగిలించిన వ్యక్తులు అతన్ని దారుణంగా కొట్టారని పోలీసులు చెప్పారు. సీసీ టీవీ కెమెరాల్లో దుండగులు వినియోగించిన కారుని కూడా పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









