బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా లూలా డా సిల్వా ఎన్నిక
- October 31, 2022
జెనీరో: బ్రెజిల్ అధ్యక్ష పదవిని వరుసగా మూడోసారి చేపట్టాలని భావించిన జైర్ బోల్సనారోకు చుక్కెదురయింది. లెఫ్టిస్ట్ వర్కర్స్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డా సిల్వా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 77 ఏండ్ల డా సిల్వా.. 51 శాతం ఓట్లతో బోల్సనారోపై విజయం సాధించారు. దీంతో ఆయన మరోసారి అధ్యక్షుడిగా బాధ్యలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో బోల్సనారోకి 49 శాతం (5,82,05,917) ఓట్లు లభించాయి.
బ్రెజిల్ చరిత్రలో అత్యంత ప్రజాధరణ పొందిన అధ్యక్షుడిగా డా సిల్వా పేరొందారు. అయితే వివాదాస్పదమైన అవినీతి ఆరోపణలతో 2010లో అధ్యక్ష పదవినుంచి తప్పుకున్నారు. అనంతరం 18 నెలలపాటు జలుశిక్ష అనుభవించాడు. 1970వ దశకంలో బ్రెజిల్‌లోని మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన డా సిల్వా.. దేశ 35వ అధ్యక్షుడిగా 2003 నుంచి 2010 వరకు పనిచేశారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







