మొన్న తమన్నా, ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్.!

- November 01, 2022 , by Maagulf
మొన్న తమన్నా, ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్.!

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో రిలీజై, మంచి విజయం అందుకుంది. ఓటీటీ ప్రేక్షకుల్ని ఈ సినిమా కథ, కథనం బాగా ఆకట్టుకున్నాయ్. 
తమన్నా తన నటనతో ఓటీటీ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఓటీటీలో మంచి క్లీన్ అండ్ ఎంటర్‌టైనర్ మూవీగా ‘బబ్లీ బౌన్సర్’ గుర్తింపు దక్కించుకుంది. మాధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈయనే మరో సినిమా తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమా కోసం ‘కొత్త బంగారు లోకం’ ఫేమ్ శ్వేతా బసు ప్రసాద్‌ని లీడ్ రోల్‌గా ఎంచుకున్నారాయన.  
‘లాక్‌డౌన్’ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. లాక్‌డౌన్ ఎంతో మంది బతుకుల్ని ఛిద్రం చేసిన సంగతి తెలిసిందే. అలాంటి కొన్ని హార్ట్ టచ్చింగ్ క్యారెక్టర్లను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు మాధుర్ భండార్కర్.
శ్వేతా బసు ప్రసాద్ ఈ సినిమాలో వేస్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే శ్వేతా బసు ప్రసాద్ పలు ఓటీటీ కంటెంట్లతో దూసుకెళుతోంది. యాక్టింగ్ స్కోపున్న రోల్స్‌తో ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ రోల్స్, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, కెరీర్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంటోంది. మరి, తాజా మూవీ ‘లాక్డౌన్’ శ్వేతా బసు ప్రసాద్‌కి ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com