రూటు మార్చేసిన యంగ్ హీరో.! ఓటీటీలో రాజ్‌తరుణ్ ‘పెళ్లి’ సందడి.!
- November 03, 2022
‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి, యంగ్ హీరోల్లో సక్సెస్‌ఫుల్ హీరో అనిపించుకున్న రాజ్ తరుణ్, ఆ తర్వాత వరుస హిట్లతో హ్యాట్రిక్ హీరో అయిపోయాడు.
అదే హ్యాట్రిక్‌ని కంటిన్యూ చేస్తూ డబుల్ హ్యాట్రిక్ కూడా కొట్టేశాడు. ఇక, అక్కడి నుంచీ రాజ్ తరుణ్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఏ సినిమా పట్టుకున్నా ఫెయిలవుతూ వచ్చింది. దాంతో మనోడ్ని బొత్తిగా పట్టించుకోవడం మానేశారు ప్రేక్షకులు.
అయినా ఏవేవో ప్రయత్నాలు చేశాడు. కానీ, తనను తాను మార్చుకోలేకపోయాడు. దాంతో, బోర్ కొట్టేశాడు రాజ్‌తరుణ్. దుకాణం కట్టేయమని ఆయన ఫ్యాన్సే రాజ్ తరుణ్‌కి ఉచిత సలహాలిచ్చేశారు. నిజంగానే సినిమాల్లో దుకాణం కట్టేసి, ఓటీటీలో దుకాణం ఓపెన్ చేశాడు రాజ్ తరుణ్.
ఓ వెబ్ సిరీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, వెను వెంటనే అది పూర్తి చేసేయడం కూడా జరిగిపోయాయ్. ఈ నెల 17 నుంచి ఆ వెబ్ సిరీస్ ఓటీటీ జీ 5 వేదికగా అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఏంటా వెబ్ సిరీస్.? అనుకుంటున్నారా.? పేరు ‘అహ నా పెళ్లంట’. హీరోయిన్ శివానీ రాజశేఖర్. ‘ఏబీసీడీ’ ఫేమ్ సంజీవ రెడ్డి ఈ వెబ్ సిరీస్‌కి దర్శకుడు. 8 ఎపిసోడ్లుగా ఈ వెబ్ సిరీస్ టెలికాస్ట్ కానుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







