అనూ గట్టిగా అనేసుకుందట.! ఆ తప్పు చేయనే చేయనంటోంది.!

- November 03, 2022 , by Maagulf
అనూ గట్టిగా అనేసుకుందట.! ఆ తప్పు చేయనే చేయనంటోంది.!

ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌కి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. దాంతో, ఆచి తూచి వ్యవహరించాలని డిసైడ్ అయ్యిందట. హీరోలను టెంప్ట్ అయ్యి సినిమాలు ఓకే చేయడం ఎంత పెద్ద తప్పో తన కెరీర్‌లో తగిలిని దెబ్బలతో బాగా అర్ధమైపోయిందని అంటోంది అనూ ఇమ్మాన్యుయేల్.
ఇకపై ఆ తప్పు చేయనంటోంది. కటౌట్ కన్నా, కంటెంట్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటోంది. అదీ నిజమే కదా. ప్రేక్షకుల ఆలోచన పూర్తిగా మారిపోయాయ్ సినిమాల విషయంలో. కంటెంట్ బాగుంటే చాలు, ప్రాంతంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు. ఆయా సినిమాలకు సూపర్ హిట్లు కట్టబెడుతున్నారు. 
అందుకే, అనూ ఇమ్మాన్యుయేల్ కూడా ఇక నుంచీ తన పంథా మార్చుకోవాలనుకుంటోందట. తాజాగా అనూ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనూ ఇమ్మాన్యుయేల్ సినిమా ప్రమోషన్లలో హుషారుగా పాల్గొంటోంది. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా తన మనసులోని మాటల్ని షేర్ చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ అనూ ఇమ్మాన్యుయేల్‌కి చాలా ప్రెస్టీజియస్‌తో కూడుకున్నది మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com