IIIT శ్రీ సిటీలో ఉద్యోగాలు...

- November 03, 2022 , by Maagulf
IIIT శ్రీ సిటీలో ఉద్యోగాలు...

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీలో ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్‌ (ఇంగ్లిష్‌) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంగ్లిష్‌ స్పెషలైజేషన్‌లో పీజీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తుల చేసుకునేందుకు అర్హులు. అలాగే మూడేళ్ల టీచింగ్‌ అనుభవం కలిగి ఉండాలి. ఎంఫిల్‌ అర్హత కలిగిన వారికి రెండేళ్ల టీచింగ్‌ అనుభవం, పీహెచ్‌డీ అర్హత కలిగిన వారికి ఏడాది టీచింగ్‌ అనుభవం ఉండాలి.

అకడమిక్‌ మెరిట్‌, రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 19, 2022వ తేదీలోపు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపిచాల్సి ఉంటుంది. నవంబర్‌ 15వ తేదీలోపు దరఖాస్తులను మెయిల్ ద్వారా పంపాలి. ఈమెయిల్‌ ఐడీ: [email protected], దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : రిజిస్ట్రార్ I/C. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ సిటీ, చిత్తూరు 630 జ్ఞాన్ మార్గ్, శ్రీ సిటీ, తిరుపతి జిల్లా – 517 646, ఆంధ్రప్రదేశ్, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iiits.ac.in/careersiiits/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com