10 దిర్హామ్ నోటులో డ్రగ్స్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వ్యక్తులు
- November 04, 2022
యూఏఈ: దుబాయ్ లోని రస్ అల్ ఖోర్ ప్రాంతంలో 10-దిర్హామ్ నోట్‌లోని రెండు రోల్స్‌లో డ్రగ్స్ దాచి వినియోగిస్తున్న ఒక ఆసియా వ్యక్తితోపాటు అప్పటికే డ్రగ్స్ మత్తులో ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ వినియోగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ముగ్గురిని కోర్టుకు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ సదరు వ్యక్తికి 5 సంవత్సరాల జైలు శిక్ష , Dhs 50,000 జరిమానా విధించింది. శిక్ష అనంతరం ఆసియా వాసిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
2022 జూన్‌లో ఈ ఘటన జరిగింది. దుబాయ్ పోలీస్‌లోని యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా విశ్వసనీయ సమాచారం అందగా.. దుబాయ్ పోలీసులు నిందితుల అడ్డాపై దాడి చేశారు. యాంటీ నార్కోటిక్స్ విభాగానికి చెందిన బృందం రస్ అల్ ఖోర్ ప్రాంతానికి వెళ్లి సమయంలో నిందితుడితో పాటు మరో ఇద్దరు డ్రగ్స్ మత్తులో ఉండగా వారందరిని అరెస్టు చేశారు. అనుమానితుడిని తనిఖీ చేయగా, అతని వద్ద 10 దిర్హామ్‌లలో రెండు ప్యాకేజీల మత్తు పదార్థాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







