సౌదీలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ను ప్రారంభించిన యువరాజు
- November 04, 2022
రియాద్: సౌదీ అరేబియాలోని మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ అయిన సీర్ను సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ప్రారంభించారు. కింగ్డమ్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసిన మొదటి సౌదీ ఆటోమోటివ్ బ్రాండ్ గా సీర్ రికార్డు సృష్టించింది. సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రాంతంలోని వినియోగదారుల కోసం సెడాన్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలతో సహా అనేక రకాల వాహనాలను సీర్ డిజైన్ చేసి విక్రయిస్తుంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిష్కరించడానికి కర్బన ఉద్గారాలను తగ్గించడం, సుస్థిరతను పెంపొందించడం వంటి సౌదీ ప్రయత్నాలకు మద్దతుగా ఎలక్ట్రిక్ వెహికల్ తయారీని ప్రొత్సహిస్తామని ప్రిన్స్ మహమ్మద్ అన్నారు. ఈ రంగంలో స్థానిక పెట్టుబడులను ఆకర్షించే, స్థానిక ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలను సృష్టించే, ప్రైవేట్ రంగాన్ని ప్రారంభించే, తదుపరి కాలంలో సౌదీ అరేబియా GDP పెరుగుదలకు దోహదపడే కొత్త పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థలకు తాము స్వాగతిస్తామన్నారు. సీర్ US$150 మిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుందని, 30,000 వరకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని ప్రశంసించారు. సీర్ వాహనాలు 2025లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సీర్ కంపెన ప్రతినిధులు తెలియజేశారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







