ఒమన్ 52వ నేషనల్ డే: ధోఫర్‌లో ఘనంగా సైనిక కవాతు

- November 19, 2022 , by Maagulf
ఒమన్ 52వ నేషనల్ డే: ధోఫర్‌లో ఘనంగా సైనిక కవాతు

సలాలా: ఒమన్ 52వ గ్లోరియస్ నేషనల్ డే సందర్భంగా ధోఫర్ గవర్నరేట్‌లోని అల్ నాస్ర్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన సైనిక కవాతుకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ (RAO), రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO), రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO), రాయల్ గార్డ్ ఆఫ్ ఒమన్ (RGO), సుల్తాన్ స్పెషల్ ఫోర్స్‌ యూనిట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ (ROP), మౌంటెడ్ మిలిటరీ, ఫిరాక్ ఫోర్సెస్ నిర్వహించిన మ్యూజిక్ బ్యాండ్‌ల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com