దుబాయ్ లో Dh654 బిలియన్ల విలువైన 100,000 రెంటల్ సూట్స్ సెటిల్

- December 19, 2022 , by Maagulf
దుబాయ్ లో Dh654 బిలియన్ల విలువైన 100,000 రెంటల్ సూట్స్ సెటిల్

దుబాయ్: గత 9 ఏళ్లలో Dh654 బిలియన్ల విలువైన 100,000 అద్దె వ్యాజ్యాలను సెటిల్ చేసినట్లు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ (DLD) న్యాయ విభాగం అయిన అద్దె వివాదాల కేంద్రం (RDC) వెల్లడించింది. RDC డైరెక్టర్ జడ్జి అబ్దుల్‌ఖాదర్ మౌసా మాట్లాడుతూ.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ చేపట్టిన రియల్ ఎస్టేట్ రంగంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి,  అభివృద్ధి చేయడానికి దుబాయ్‌లోని అద్దె వివాదాల సెంటర్ కృషి చేస్తుందన్నారు.  

వివాదల పరిష్కారాల్లో రికార్డు

అద్దె వివాదాలను పరిష్కరించడంలో అద్దె వివాదాల కేంద్రం విశేషమైన విజయాన్ని సాధించింది. ఈ రోజు వరకు కేంద్రంలో నమోదైన వ్యాజ్యాల సంఖ్య 103,975 కు చేరుకుంది. వీటిలో 92,732 ప్రాథమిక, 11,243 అప్పీల్ వ్యాజ్యాలుగా విభజించారు. ఇందులో ఇప్పటివరకు 100,000 వ్యాజ్యాలు పరిష్కరించబడ్డాయి. దీంతో కేంద్రంలో నమోదైన వ్యాజ్యాల్లో 96% కేసులు పరిష్కారం అయినట్లు అబ్దుల్‌ఖాదర్ మౌసా వెల్లడించారు. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్‌లో మొత్తం విలువ Dh654 బిలియన్ల ఒప్పందాలు జరుగగా.. ఇందులో కేవలం 1.9% (5.2 మిలియన్) ఒప్పందాల్లో మాత్రమే వివాదం తలెత్తిందన్నారు. ఇది ఎమిరేట్‌లోని చట్టాలు, శాసన వ్యవస్థపై సమాజ విశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com