భారత్ లోకి ప్రవేశించిన బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్..
- December 21, 2022
చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించింది. డ్రాగన్ కంట్రీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాలో కరోనా వ్యాప్తికి బిఎఫ్ 7 వేరియంట్ కారణమైంది. బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. గుజరాత్, ఒడిశాలో కేసులను గుర్తించారు.
గుజరాత్ లోని వడోదరలో ఓ ఎన్ఆర్ఐ మహిళకి ఒమిక్రాన్ బిఎఫ్ 7 వేరియంట్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో సదరు మహిళతో పాటు మరో ముగ్గురిని ఐసోలేషన్ కి తరలించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించింది. విదేశీ ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు భారత్ లో మూడు బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులను అధికార వర్గాలు గుర్తించాయి.గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక కేసు నమోదయిందని అధికారి పేర్కొన్నారు. భారత్ లో తొలిసారి ఈ వేరియంట్ ను గుర్తించారు. గత అక్టోబర్ నెలలో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







