రెండు గంటల్లోనే 300 ఉల్లంఘనలు నమోదు
- December 23, 2022
కువైట్: షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని వివిధ కార్ల రిపేర్ గ్యారేజీల వద్ద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తనిఖీ ప్రచారాన్ని ప్రారంభించింది. కేవలం రెండు గంటల్లోనే సుమారు 300 ఉల్లంఘనలను జారీ చేసినట్లు ట్రాఫిక్ డిపార్టుమెంట్ తెలిపింది. బ్రిగేడియర్ జనరల్ మెషాల్ అల్-సువైజీ నేతృత్వంలో మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ శాఖ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ సూచనల ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిని పర్యవేక్షించడానికి, ప్రధానంగా మరమ్మతుల గురించి సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. రెండు గంటల తనిఖీలో అధికారులు 300 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేశారని, నివాస చట్టాన్ని ఉల్లంఘించిన నలుగురిని అరెస్టు చేసినట్లు ట్రాఫిక్ డిపార్టుమెంట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!







