‘పవర్’ వారసుడొచ్చాడహో.! అకీరానందన్ ఎంట్రీ.!
- December 31, 2022
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల తనయుడు అకీరానందన్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆగండాగండి సినిమాల్లోకి కాదు. న్యూ ఇయర్ సందర్భంగా డిశంబర్ 31న పవన్ కళ్యాణ్ నటించిన సెన్సేషనల్ మూవీ ‘ఖుషీ’ రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
విడుదలైన అన్ని ధియేటర్లలోనూ సినిమాకి హౌస్‌ఫుల్ బోర్డులే. కొత్త సినిమా రిలీజ్‌కి వున్నంత హంగామా నెలకొంది. టిక్కెట్లు కూడా దొరకని పరిస్థితి.
ఇక, హైద్రాబాద్‌లో ఓ ధియేటర్లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ సందడి చేశాడు. తండ్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషీ’ సినిమాని వీక్షించాడు అకీరానందన్.
ముఖానికి మాస్క్ వేసుకుని హీరో లుక్స్‌లో దర్శనమిస్తున్నాడు. సినిమా ధియేటర్ వద్ద కెమెరాకి చిక్కిన అకీరానందన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయ్.
వారసుడొచ్చాడహో.! అంటూ నెట్టింటి వేదికగా ఈ మెగా ఆరడుగుల ఆజానుబాహుబడి ఫోటోలను వైరల్ చేసేస్తున్నారు పవన్ అభిమానులు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







