మాజీ భర్త కారును తీసుకెళ్లిన మహిళ.. Dh4,000 ట్రాఫిక్ జరిమానాలు
- January 08, 2023
అల్ ఐన్: అల్ ఐన్‌లోని ఒక మహిళ తన మాజీ భర్త వాహనాన్ని తీసుకొని ఇష్టానుసారంగా నడిపింది. దీంతో సదరు వ్యక్తికి 4,000 దిర్హామ్‌లు చెల్లించాలని ట్రాఫిక్ విభాగం నుంచి నోటీసులు అందాయి. కోర్టు రికార్డ్స్ ప్రకారం, కారు మరమ్మతులు, ట్రాఫిక్ జరిమానాల కోసం 11,700 దిర్హామ్‌లు ఖర్చు చేసిన తర్వాత వ్యక్తి మహిళపై కేసు నమోదు చేశాడు. ఆమె అతని కారును తీసుకొని అతని అనుమతి లేకుండా ఉపయోగించిందని, వాహనాన్ని నడుపుతున్నప్పుడు మహిళ ట్రాఫిక్ ప్రమాదానికి గురైందని, దాని ఫలితంగా అతనికి Dh4,500 మరమ్మతులకు ఖర్చు అయ్యాయని, Dh7,220 విలువైన ట్రాఫిక్ జరిమానాలకు ఖర్చయిందని అతను ఫిర్యాదు చేశాడని కోర్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే, ఆమె వాంగ్మూలంలో ఈ ఆరోపణలను ఖండించారు. మహిళ నడపడం కారణంగానే వాహనం మరమ్మతులకు గురైందని ఫిర్యాదుదారు రుజువులు ఇవ్వలేదని కోర్టు తెలిపింది. అయితే, ట్రాఫిక్ జరిమానా చెల్లింపు రసీదుల ప్రకారం Dh4,000 విలువైన జరిమానాలు నమోదు చేయబడ్డాయని పేర్కొంది. కేసును విచారించిన న్యాయమూర్తి మహిళ తన మాజీ భర్తకు కేవలం 4,000 దిర్హామ్‌లు మాత్రమే చెల్లించాలని, దానితో పాటు న్యాయపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







