సౌదీలో విషాదం.. వరదలో కొట్టుకుపోయిన నలుగురు చిన్నారులు!

- March 16, 2023 , by Maagulf
సౌదీలో విషాదం.. వరదలో కొట్టుకుపోయిన నలుగురు చిన్నారులు!

సౌదీ: సౌదీ అరేబియాలోని జజాన్‌లోని దక్షిణ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు.. వరదల్లో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో వాహనంలోని నలుగురు చిన్నారులు కొట్టుకుపోగా.. డ్రైవింగ్ సీట్లో ఉన్న తండ్రిని స్థానికులు రక్షించారు. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిజాన్ ప్రాంతంలోని సబ్యా గవర్నరేట్‌లోని వారి గ్రామానికి కుటుంబం తిరిగి వస్తుండగా వాడి అబు హతారాలో ప్రవాహం ధాటికి వారి కారు కొట్టుకుపోయింది. ఇందులో ఉన్న ముగ్గురు బాలికలు, వారి సోదరుడు వరదలో కొట్టుకుపోయారు.

ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, భారీ వర్షాల సమయంలో లోయలు, దిబ్బలను దాటవద్దని సాధారణ ట్రాఫిక్ విభాగం (@eMoroor) ప్రజలను హెచ్చరించింది. కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదల సమయంలో లోయలు, దిబ్బలను దాటడం ప్రమాదకరమని, ట్రాఫిక్ ఉల్లంఘనకు గరిష్టంగా SR10,000 జరిమానా విధించబడుతుందని డిపార్ట్‌మెంట్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒ ప్రకటనలో తెలిపింది.

గత వారంరోజులుగా  సౌదీ అరేబియాలో కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రియాద్‌లో బుధవారం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములతో కూడిన భారీ వర్షం కొనసాగుతుందని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) అంచనా వేసింది. అల్-హరిక్, దిరియా, అల్-ఖర్జ్, అల్-రేన్, అల్-ముజాహిమియా, హురైమిలా, హోతత్ బని తమీమ్, దుర్మా, మురాత్ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. వర్షంతో
పాటు ఉపరితల గాలులు, వడగళ్ల వానలు, కుండపోతలు, తక్కువ దృశ్యమానత కూడా ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రజలను అప్రమత్తం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com