అల్లు అర్జున్ హీరోయిన్‌కి ఇప్పుడేం గుర్తుకొచ్చిందటా.!
- March 25, 2023
అప్పుడెప్పుడో అల్లు అర్జున్ హీరోగా ‘వరుడు’ అనే సినిమా వచ్చింది. బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ అది. అబ్బో.! ఆ సినిమా విషయంలో రిలీజ్‌కి ముందు చిత్ర యూనిట్ చేసిన అనవసరమైన హంగామా అంతా ఇంతా కాదు. అప్పట్లో అదో సెన్సేషన్ ఆయె.
అన్నింటికీ మించి ఈ సినిమాలోని హీరోయిన్. రిలీజ్ వరకూ ఈ సినిమాలోని హీరోయిన్ని కనిపించకుండా దాచేసి వుంచి ఓ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు.
ఆ హీరోయిన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆమె పేరు భానుశ్రీ. ఈ మధ్య అల్లు అర్జున్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఈమె పేరు తొలగించాడనీ అదో పెద్ద రచ్చ జరిగింది నెట్టింట్లో.
అలా ఎప్పుడో మర్చిపోయిన ఈ భామ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా వయసు మీద పడ్డ హీరోయిన్లు, హీరోల మధ్య డిఫరెన్స్ గురించి చెబుతూ మరోసారి సెన్సేషనల్ అయ్యే ప్రయత్నం చేసింది భానుశ్రీ.
వయసు మీద పడినా హీరోలు మాత్రం టీనేజ్ పాత్రలు చేస్తున్నారు. హీరోయన్లు మాత్రం తల్లి పాత్రలతో సరిపెట్టుకోవల్సి వస్తోంది. హీరోయిన్ల విషయంలో ఎందుకింత వివక్ష చూపిస్తున్నారు.. అంటూ నిలదీసింది భానుశ్రీ. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా, భిన్న స్పందనలు వస్తున్నాయ్. చూస్తుంటే, ఎలాగోలా తన ఉనికిని చాటుకునేందుకే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది కాబోలు ఈ అమ్మడు.. అనిపిస్తోంది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







