పవన్ ‘ఓజీ’ కోసం బాలీవుడ్ గ్లామర్ అద్దబోతున్నారా.?

- March 28, 2023 , by Maagulf
పవన్ ‘ఓజీ’ కోసం బాలీవుడ్ గ్లామర్ అద్దబోతున్నారా.?

సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాకి ‘ఓజీ’ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. మొన్నీ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడనీ తెలుస్తోంది.
కాగా, ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్‌ని పరిశీలిస్తున్నారట. ఆమె ఎవరో కాదు, అనుష్క శర్మ అని ప్రచారం జరుగుతోంది. అనుష్క శర్మ ఓకే అంటే, ఇదే ఆమెకు తెలుగులో తొలి సినిమా అవుతుంది.

అలాగే, మరో హీరోయిన్‌కీ ఈ సినిమాలో ఛాన్స్ వుందట. టాలీవుడ్ నుంచి ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల పేరు బాగా వినిపించింది. చూడాలి మరి, ఎవరు ఫైనల్ అవుతారో. అన్నట్లు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 90 రోజులు డేట్లు కేటాయించారు. ప్రస్తుతం ‘వినోదయ సితం’, ‘హరి హర వీరమల్లు’ సినిమాలతో బిజీగా వున్నారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com