‘ఎన్టీయార్ 30’: జాన్వీ కపూర్ రోల్ ఏంటో తెలుసా.!
- April 04, 2023
అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్, ‘ఎన్టీయార్ 30’ సినిమా ద్వారా సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నార్త్ జనాలకు హీరోయిన్గా ఎప్పుడో పరిచయమైనప్పటికీ అక్కడ కమర్షియల్ గుర్తింపు దక్కించుకోలేకపోయింది జాన్వీ కపూర్.
ఛాలెంజింగ్ రోల్స్‌తోనే తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అయితే, టాలీవుడ్ విషయానికి వస్తే, ఇక్కడ కమర్షియల్ హీరోయిన్ ముద్ర వేయించుకుంటేనే కెరీర్ సవ్యంగా సాగుతుంది.
ఆ యాంగిల్లోనే తొలి సినిమాలో జాన్వీ క్యారెక్టర్ ఎలా వుంటుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఓ జాలరి కుమార్తెగా ఈ సినిమాలో జాన్వీ నటించబోతోందనీ తెలుస్తోంది.
పాత్ర పరంగా డీ గ్లామర్ రోలే అయినప్పటికీ, కాస్త గ్లామరస్‌గానూ జాన్వీని చూపించబోతున్నాడట దర్శకుడు కొరటాల. రోల్ గురించి గుస గుస బయటికి వచ్చాకా, ఆ పాత్రలో జాన్వీ కపూర్ ఎలా వుంటుందా.? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!







