గోల్డెన్ లైసెన్స్‌ను ప్రారంభించిన బహ్రెయిన్
- April 04, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో భారీ ఎత్తున పెట్టుబడి ప్రాజెక్టులలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహకాలను అందించేందుకు గోల్డెన్ లైసెన్స్‌ను ప్రారంభించినట్లు బహ్రెయిన్ ప్రకటించింది. ఇది ఆర్థిక సంస్కరణల క్రింద పెట్టుబడులను ప్రోత్సహించడానికి.. ఉద్యోగ కల్పనను పెంచడానికి బహ్రెయిన్ చేపట్టిన ప్రయత్నంలో ఒక ముఖ్యమైన అడుగుగా వెల్లడించింది. బహ్రెయిన్‌లో 500 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించే ప్రధాన పెట్టుబడి, వ్యూహాత్మక ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్న కంపెనీలు లేదా పెట్టుబడి విలువ USD 50 మిలియన్లకు మించి ఉన్న కంపెనీలు లైసెన్స్‌కు అర్హులు. ఈ లైసెన్స్‌తో కంపెనీలు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల సేవలు, యుటిలిటీల కోసం భూమిని ప్రాధాన్యతా కేటాయింపులతో సహా అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. దీనితోపాటు వ్యాపార లైసెన్సింగ్, బిల్డింగ్ పర్మిట్ ఆమోదం, అలాగే బహ్రెయిన్ లేబర్ ఫండ్, తమ్కీన్, బహ్రెయిన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి మద్దతుతో సహా ప్రభుత్వ సేవలకు క్రమబద్ధీకరించిన అనుమతులను త్వరగా పొందే అవకాశం ఉంది. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన బహ్రెయిన్ క్యాబినెట్ ఈ గోల్డెన్ లైసెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ లైసెన్స్ ద్వారా స్థానిక, అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షించడం, స్థానికంగా ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD







