ఏప్రిల్ 17 నుండి ఫ్లోటింగ్ బ్రిడ్జి 5 వారాల పాటు మూసివేత

- April 15, 2023 , by Maagulf
ఏప్రిల్ 17 నుండి ఫ్లోటింగ్ బ్రిడ్జి 5 వారాల పాటు మూసివేత

దుబాయ్: ప్రధాన నిర్వహణ పనుల నేపథ్యంలో ఏప్రిల్ 17 నుండి 5 వారాల పాటు ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ని మూసివేయనున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, ప్రత్యామ్నాయ రోడ్లు, క్రాసింగ్‌లకు ట్రాఫిక్‌ను మళ్లించడానికి అధికార యంత్రాంగం రూపొందించిన ఒక సమగ్ర ప్రణాళికను విడుదల చేసింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, ఎమిరేట్స్ రోడ్ వంటి ప్రధాన రహదారులతో పాటు అల్ ఇత్తిహాద్ స్ట్రీట్ నుండి వచ్చే వాహనదారుల కోసం RTA అల్ మమ్జార్ స్ట్రీట్ ను తెరువనుంది.

షార్జా నుండి అల్ ఇత్తిహాద్ స్ట్రీట్: కైరో, అల్ ఖలీజ్ స్ట్రీట్‌ల ద్వారా ఇన్ఫినిటీ బ్రిడ్జికి వెళ్లి.. (గతంలో బస్సులు, టాక్సీలకు మాత్రమే పరిమితం) అల్ మమ్జార్ బయటకు వెళ్లవచ్చు.

డీరా నుండి బుర్ దుబాయ్‌ : ఇన్ఫినిటీ బ్రిడ్జిని ఉపయోగించవచ్చు.

అల్ ఇత్తిహాద్ రోడ్ ద్వారా షార్జా నుండి బుర్ దుబాయ్‌కి : కైరో, అల్ ఖలీజ్ స్ట్రీట్స్, అలాగే అల్ గర్హౌద్ బ్రిడ్జ్ లేదా అల్ మక్తూమ్ బ్రిడ్జ్ ద్వారా ఇన్ఫినిటీ బ్రిడ్జిని ఉపయోగించవచ్చు.

ఖలీద్ బిన్ అల్ వలీద్ స్ట్రీట్ ద్వారా బుర్ దుబాయ్ నుండి దీరాకు : అల్ మక్తూమ్ వంతెన, ఇన్ఫినిటీ బ్రిడ్జిని ఉపయోగించవచ్చు.

ఉమ్ హురైర్ రోడ్ ద్వారా బుర్ దుబాయ్ నుండి డీరాకు: అల్ మక్తూమ్ వంతెనను ఉపయోగించవచ్చు.

షేక్ జాయెద్ రోడ్ ద్వారా బుర్ దుబాయ్ నుండి దీరాకు : అల్ గర్హౌద్ బ్రిడ్జ్, అల్ మక్తూమ్ బ్రిడ్జ్, ఇన్ఫినిటీ బ్రిడ్జ్,  బిజినెస్ బే క్రాసింగ్‌ని ఉపయోగించవచ్చు.

ఔద్ మేథా రోడ్ ద్వారా బుర్ దుబాయ్ నుండి దీరాకు : అల్ మక్తూమ్ వంతెన, అల్ గర్హౌద్ వంతెనలను ఉపయోగించవచ్చు.

అల్ రియాద్ స్ట్రీట్ ద్వారా బర్ దుబాయ్ నుండి డీరాకు: అల్ మక్తూమ్ వంతెనను ఉపయోగించవచ్చు.

బుర్ దుబాయ్, దీరా మధ్య ప్రయాణించే వాహనదారులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, ఎమిరేట్స్ రోడ్ వంటి ప్రధాన రహదారులను ఉపయోగించవచ్చు. ఫ్లోటింగ్ బ్రిడ్జిని మూసివేసే సమయంలో సజావుగా ప్రవహించేలా ట్రాఫిక్ కదలికలను పర్యవేక్షిస్తామని అధికార యంత్రాంగం తెలిపింది. వాహనదారులు వేగ పరిమితులను పాటించాలని, ప్రత్యామ్నాయ రహదారులు, ప్రజా రవాణా మార్గాలను ఉపయోగించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com