10 విదేశీ కార్ ఏజెన్సీలకు భారీ జరిమానా విధించిన సౌదీ

- June 12, 2023 , by Maagulf
10 విదేశీ కార్ ఏజెన్సీలకు భారీ జరిమానా విధించిన సౌదీ

రియాద్: సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని 10 కార్ ఏజెన్సీలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక జరిమానాలు విధించింది. ఇది సౌదీ కమర్షియల్ ఏజెన్సీ చట్టం, దాని కార్యనిర్వాహక నిబంధనలను ఉల్లంఘించినందుకు.. అలాగే నిర్వహణ, విడిభాగాల సదుపాయం, తయారీ నాణ్యతను నిర్ధారించడం,  వినియోగదారునికి అమ్మకాల తర్వాత సేవలను అందించడం కోసం నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు విధించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

వినియోగదారుల అభ్యర్థన తేదీ నుండి 14 రోజులలోపు ప్రత్యేక సాంకేతిక వివరణలతో కూడిన విడిభాగాలను అందించడంలో విఫలమైనందుకు జర్మన్ కార్ ఏజెన్సీ ఉల్లంఘనలకు పాల్పడింది. ఉల్లంఘనలకు పాల్పడిన రెండు అమెరికన్ కార్ ఏజెన్సీలకు జరిమానాలు విధించారు. మూడు జపాన్ కార్ ఏజెన్సీలకు మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది. చట్టం నిర్దేశించిన 14 రోజుల వ్యవధిలో వినియోగదారునికి విడిభాగాలను అందించడంలో ఆలస్యం కారణంగా జరిమానా విధించారు. అదేవిధంగా తన కొత్త కారును డెలివరీ చేయడంలో జాప్యం చేసినందుకు, ఇతర కారణాలతో నాలుగు చైనా కార్ ఏజెన్సీలకు మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com