యూట్యూబర్లకు గుడ్ న్యూస్..
- June 14, 2023
యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు శుభవార్త.. మీ యూట్యూబ్ ఛానల్‌కు మానిటైజేషన్ లేదా? అయితే, ఇకపై ఛానల్ మానిటైజేషన్ పొందాలంటే 1000 మంది సబ్‌స్ర్కైబర్లు అవసరం లేదు. కేవలం 500 మంది సబ్‌స్ర్కైబర్లు తెచ్చుకుంటే చాలు.. యూట్యూబ్ మీకు మానిటైజేషన్ ఎనేబట్ చేస్తుంది. మీ కంటెంట్‌పై యాడ్స్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పటికే యూట్యూబ్ షార్ట్ వీడియో క్రియేటర్లు కూడా యూట్యూబ్‌లో తమ కంటెంట్ ద్వారా మానిటైజేషన్ పొందుతున్నారు. కంటెంట్‌ను మానిటైజ్ కోసం మరిన్ని అవకాశాలను ఉన్నప్పటికీ చాలామంది షార్ట్ వీడియో క్రియేటర్లు ఇప్పటికీ తమ సబ్‌స్ర్కైబర్లను పెంచుకునేందుకు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. మానిటైజేషన్ ఎనేబుల్ కావాలంటే.. యాడ్స్ ఇవ్వాలన్నా నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
మీరు యూట్యూబ్ లో 1000 సబ్‌స్క్రైబర్‌లను తెచ్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు గూగుల్ యాజమాన్యంలోని వీడియో కంపెనీ యూట్యూబ్ కనీస సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను 1000 నుంచి 500కి తగ్గించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో షార్ట్ క్రియేటర్లకు మరిన్ని అవకాశాలను అందించడానికి యూట్యూబ్ మానిటైజేషన్ విధానాలకు భారీ మార్పులు చేస్తోంది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు అర్హత అవసరాలను తగ్గిస్తోంది. తద్వారా తక్కువ ఫాలోయింగ్ ఉన్న క్రియేటర్‌లకు అందుబాటులో ఉన్న మానిటైజేషన్ విధానాల్లో పరిధిని విస్తరింపజేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
కొత్త మానిటైజేషన్ రూల్స్ ఇవే:
గతంలో యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో చేరడానికి, తమ కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి క్రియేటర్లు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. యూట్యూబ్‌లో మానిటైజేషన్‌కు కనీసం (1000) మంది సబ్‌స్క్రైబర్లు తప్పక ఉండాలి. అంతేకాదు.. ఏడాదిలో కనీసం 4000 వాచింగ్ అవర్స్ లేదంటే.. చివరి 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ వచ్చి ఉండాలి. కొత్త మానిటైజేషన్ నిబంధనల ప్రకారం.. ఇక నుంచి యూట్యూబ్‌లో 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి. చివరి 90 రోజుల్లో కనీసం 3 లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ వీడియోలను క్రియేట్ చేసి ఉండాలి.
ఏడాదిలో 3వేల గంటల వ్యూస్ లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మానిటైజేషన్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. యూట్యూబ్ వీడియో మానిటైజేషన్ బెంచ్‌మార్క్ ప్రకారం..(4000) వాచింగ్ అవర్స్ నుంచి (3000) వాచింగ్ అవర్స్‌కు తగ్గించింది. యూట్యూబ్ మానిటైజేషన్ పొందాలంటే.. 10 మిలియన్ల నుంచి 3 మిలియన్లకు తగ్గించింది. యూట్యూబ్ ఈ కొత్త అప్‌డేట్ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, తైవాన్, దక్షిణ కొరియాలో మాత్రమే అమల్లో ఉంటుంది. భారత్‌లో కూడా కొత్త మానిటైజేషన్ రూల్స్ అందుబాటులోకి వస్తాయా లేదా అనేది యూట్యూబ్ క్లారిటీ ఇవ్వలేదు.
షార్ట్ క్రియేటర్ల కోసం యాడ్ రెవిన్యూ షేరింగ్ ప్రొగ్రామ్:
షార్ట్ క్రియేటర్‌లు ఇప్పుడు యూట్యూబ్‌లో తమ కంటెంట్‌ను మానిటైజ్ చేసేందుకు మరిన్ని అవకాశాలను అందిస్తోంది. ఇప్పటికీ తమ సబ్‌స్ర్కైబర్లు పెంచుకోక తప్పదు. యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఆదాయ భాగస్వామ్యానికి ఇప్పటికే ఉన్న నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే, యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు ఇప్పటికే అర్హత సాధించిన క్రియేటర్లు అధిక పరిమితులను సాధించిన తర్వాత మళ్లీ అప్లయ్ చేయాల్సిన అవసరం లేదని గమనించాలి. యూట్యూబ్ తన యాడ్స్ ద్వారా పార్టనర్ ప్రోగ్రామ్ ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి క్రియేటర్లను అనుమతిస్తుంది. ప్రత్యేకించి ఈ ప్లాట్‌ఫారమ్ షార్ట్-ఫారమ్ కంటెంట్ కోసం యాడ్ రెవిన్యూ షేరింగ్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది. క్రియేటర్లు తమ కంటెంట్‌ను మానిటైజ్ చేసుకునేలా యూట్యూబ్ వారిని ప్రోత్సహించడంతో పాటు షార్ట్-ఫారమ్ కంటెంట్ ఆఫర్‌లను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి