చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
- July 07, 2023
చెన్నై: చెన్నై కేంద్రంగా ఉన్న మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రోలింగ్ స్టాక్, పవర్ సిస్టమ్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేయనున్న పోస్టుల్లో జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదిర పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విషయానికి వస్తే పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధుల ఎంపిక ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు వేతనంగా 60,000రూ నుండి 2.3లక్షలు చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు 4 ఆగస్టు 2023 తుదిగడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://chennaimetrorail.org/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!







