మెగా బర్త్ డే స్పెషల్.! న్యూ అప్డేట్స్తో ‘చిరు’ శుభాకాంక్షలు.!
- August 22, 2023
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే అంటే అభిమానులకు అసలు సిసలు పెద్ద పండగ అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఆయన బర్త్ డే పేరు చెప్పి, ఊరూ వాడా అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు.
అవును మరి, కేవలం నటుడు మాత్రమే కాదు చిరంజీవి. ఆయన ఓ శక్తి. సినీ అభిమానులు ఆ రకంగా పండగ చేసుకుంటుంటే, సినీ మేకర్లు ఆయనతో తీయబోయే కొత్త సినిమా అప్డేట్లు రిలీజ్ చేస్తూ అభిమానులకు అదనంగా ఆనందాన్ని పంచుతుంటారు.
ఆయన ప్రస్తుతం రెండు సినిమాల్నీ లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి చిరు తనయ సుస్మిత ప్రొడక్షన్ హౌస్ (గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్)లో రూపొందుతోంది. ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

చిరంజీవి బర్త్‌డే సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే ‘బింబిసార’ సినిమా డైరెక్టర్ వశిష్టతో చిరంజీవి తన 157వ సినిమా చేస్తున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ పోస్టర్‌తో ఈ సినిమా అప్డేట్ కూడా రిలీజ్ చేస్తూ తమ అభిమాన హీరోకి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







