టికెట్ల కోసం పోటెత్తిన అభిమానులు..
- August 26, 2023
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతుండడంతో టికెట్ల విక్రయాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రారంభించింది. అయితే.. ఇలా టికెట్ల విక్రయాలు ప్రారంభం కాగా అలా అధికారిక వెబ్సైట్ క్రాష్ అయ్యింది. దాదాపు 35 నుంచి 40 నిమిషాల వరకు పని చేయలేదు. ఆ తరువాత అందుబాటులోకి వచ్చినా అప్పటికే సహనం కోల్పోయిన కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.
ప్రపంచ కప్ టికెట్లను బుక్ మై షో యాప్, వైబ్‌సైబ్ ద్వారా విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇప్పటికే తెలియజేసింది. మొదటి రోజు వార్మప్ మ్యాచ్‌లతో సహా భారతేతర మ్యాచ్‌ల టికెట్లను శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి విక్రయించడం మొదలుపెట్టారు. అయితే.. ఫ్యాన్స్ నుంచి అధిక డిమాండ్ ఉండడంతో బుక్ మై షో యాప్, వెబ్ సైట్ ఒక్కసారిగా క్రాష్ అయింది. సుమారు 35 నుంచి 40 నిమిషాల పాటు పని చేయలేదు. దీనిపై నెటీజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను అమ్మేటప్పుడు పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని కామెంట్లు పెడుతున్నారు. ఆగస్టు 30 నుంచి టీమ్ఇండియా ఆడే మ్యాచులకు సంబంధించిన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
టికెట్ల విక్రయాల వివరాలు..
ఆగస్ట్ 25 – నాన్ ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లు
ఆగస్టు 30 – గౌహతి, త్రివేండ్రంలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
ఆగష్టు 31 – చెన్నై, ఢిల్లీ, పూణేలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 1 – ధర్మశాల, లక్నో,ముంబైలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 2 – బెంగళూరు, కోల్‌కతాలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 3 – అహ్మదబాద్‌లో జరిగే భారత మ్యాచ్ టికెట్లు
సెప్టెంబర్ 15- సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచుల టికెట్లు లను విక్రయిస్తారు.
తాజా వార్తలు
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!







