మోటర్‌బైక్ స్టంట్ డ్రైవర్ AED50,000 జరిమానా
- August 26, 2023
దుబాయ్: ప్రమాదకరమైన వీలీ స్టంట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దుబాయ్ పోలీసులు మోటర్‌బైక్ డ్రైవర్‌ను అరెస్టు చేసి జరిమానా విధించారు. తన మోటార్‌సైకిల్‌ను నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రధాన రహదారిపై విన్యాసాలు చేస్తున్నందుకు దుబాయ్ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని ప్రమాదకరమైన ప్రవర్తనను చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. దుబాయ్ పోలీస్‌లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వీడియో ప్రసారం కావడంతో తక్కువ వ్యవధిలో పోలీసు పెట్రోలింగ్ నిర్లక్ష్య ప్రవర్తనకు కారణమైన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. మోటర్సైక్లిస్ట్కు AED50,000 ($13,600) జరిమానా విధించబడింది. అతని ట్రాఫిక్ రికార్డ్‌లో 23 బ్లాక్ పాయింట్లను విధించారు. గత ఏడు నెలల్లో 858 మోటార్‌సైకిళ్లను జప్తు చేయడంతో పాటు ఎమిరేట్‌లో మోటార్‌సైకిళ్లపై 22,115 ఉల్లంఘనలను జారీ చేసినట్టు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







