సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రవాస తెలుగు ఫ్యామిలీ దుర్మరణం
- August 27, 2023
రియాద్: సౌదీ అరేబియాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు ప్రవాసీ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు దుర్మరణం చెందారు. రియాద్ పోలసులు తెలిపిన వివరాల ప్రకారం.. కువైత్‌లోని అమెరికన్ యూనివర్సిటీలో పని చేస్తున్న దండు గౌస్ బాషా తన భార్య తబారక్ సర్వర్, ఇద్దరు కుమారులు ఏహాన్ (02), దామీల్ (8 నెలలు) తో కలిసి 10 రోజుల క్రితం సౌదీ వచ్చారు.
మక్కా, మదీన పుణ్యక్షేత్రాలను సందర్శించుకొని తిరిగి కువైత్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. హఫ్నా రోడ్డుపై వీరు ప్రయాణిస్తున్న కారును ఒక ట్రాలీ ఢీకొట్టింది. దాంతో కారులో మంటలు చెలరేగి మొత్తం కుటుంబం అగ్నికి అహుతి అయింది. మృతదేహాలను రియాద్ సమీపంలోని రూమా ఆసుపత్రికి తరలించారు. మృతుడు గౌస్ అన్నమయ్య జిల్లా కడకడ మండల కేంద్రానికి చెందిన వారని ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్దిఖ్ తువూరు తెలిపారు. ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు ఇద్దరూ ఒక్కసారి కుప్పకూలడంతో స్వస్ధలంలో ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. అల్ రుమాలో వీరి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సద్దిఖ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







