2024 మే 14 నుంచి ఖతార్ ఎకనామిక్ ఫోరమ్
- August 27, 2023
దోహా: నాల్గవ వార్షిక "ఖతార్ ఎకనామిక్ ఫోరమ్, పవర్డ్ బై బ్లూమ్‌బెర్గ్ " మే 14-16, 2024 వరకు దోహాలో జరుగుతుందని ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ హయ్యర్ ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది. ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి సమగ్రంగా చర్చించనున్నారు. ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ హయ్యర్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్, మీడియా సిటీ ఖతార్ సీఈఓ షేక్ అలీ బిన్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్-థానీ మాట్లాడుతూ.. ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రపంచ ఆలోచనాపరులు, పరిశ్రమ మార్గదర్శకులు, ప్రభావవంతమైన నిర్ణయాధికారులను ఒకచోట చేర్చే ఈవెంట్ అన్నారు. ఫోరమ్ ఖతార్‌కు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ఆర్థిక సమాలోచనలను అందజేస్తుందని తెలిపారు. కు బ్లూమ్‌బెర్గ్ మీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్కాట్ హెవెన్స్ మాట్లాడుతూ.. ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభమైనప్పటి నుండి ఈ ప్రాంతం ప్రముఖ వ్యాపార కేంద్రంగా మారిందని తెలిపారు. డైనమిక్ ఆర్థిక భవిష్యత్తును రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను సమావేశపరిచే వేదికగా ఇది నిలిచిందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







