‘ఓజీ’ అసలు సిసలు పండగ వచ్చేస్తోంది.!
- August 27, 2023
ఇంతవరకూ పోస్టర్లతోనూ, టైటిల్ ప్రమోషన్లతోనూ ఊదరగొట్టారు. ఇక, అసలు సిసలు పండగ రాబోతోంది. అదేనండీ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘ఓజీ’ నుంచి టీజర్ రాబోతోంది.
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్లు. దాదాపు 72 సెకన్ల పాటు ఈ టీజర్ వుండబోతోందట.
యంగ్‌స్టర్.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అర్జన్ దాస్ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ వుండబోతోందనీ తెలుస్తోంది. ఈ టీజర్ కోసం వెయిట్ చేస్తూ ఫ్యాన్స్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు సోషల్ మీడియా వేదికగా.
ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రియా రెడ్డి ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనుంది. సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
అన్నట్లు ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాల్లోనే నటిస్తున్నారు. ఆ లెక్కల్లో లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న స్ర్టెయిట్ మూవీగా ‘ఓజీ’ని చెప్పుకోవచ్చు.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







