విమాన టిక్కెట్ల పై భారీ సేవింగ్ కావాలా? అయితే ఇలా చేయండి..!!

- September 08, 2023 , by Maagulf
విమాన టిక్కెట్ల పై భారీ సేవింగ్ కావాలా? అయితే ఇలా చేయండి..!!

యూఏఈ: రస్ అల్ ఖైమా,  ఫుజైరా విమానాశ్రయాల నుండి బయలుదేరే విమానాలలో బుకింగ్ చేయడానికి యూఏఈ ప్రయాణికులు ప్రాధాన్యత ఇటీవల పెరిగింది. మార్కెట్ పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రయాణీకులు నార్తర్న్ ఎమిరేట్స్ నుండి బయటికి వెళ్లేందుకు టిక్కెట్ల కోసం ట్రావెల్ ఏజెంట్లను ఎక్కువగా అడుగుతున్నారు. ఈ విమానాశ్రయాలు మరింత సరసమైన విమాన ఛార్జీలు, తక్కువ రద్దీ, సులభతరమైన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను అందిస్తున్నందున ప్రజాదరణ పొందుతున్నాయని తెలిపారు. షార్జా నివాసి రహ్మత్ అలీ ఇటీవల RAK విమానాశ్రయం నుండి ఇండియాలోని హైదరాబాద్‌కు వెళ్లాడు, విమానాశ్రయంలోకి ప్రవేశించిన 20 నిమిషాల్లోనే తన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను పూర్తి చేసినట్లు అతను చెప్పాడు. "దుబాయ్, షార్జా నుండి ప్రయాణించే దానితో పోలిస్తే విమాన ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నందున నేను RAK నుండి ముంబైకి వెళ్లాలని ఎంచుకున్నాను. ప్రయాణం సాఫీగా ఉంది. ఇమ్మిగ్రేషన్, విమానాశ్రయ చెకింగ్ లాంటి పనులకు ఎక్కువ సమయం పట్టలేదు. " అని అలీ వివరించారు. "నేను గత నెలలో విమానాల కోసం ఆన్ లైన్ లో చూసినప్పుడు  దుబాయ్ నుండి అత్యల్ప టిక్కెట్ ధర Dh680, షార్జా నుండి Dh590 చూపెట్టింది. కానీ RAK నుంచి Dh400కే టిక్కెట్‌ని పొందాను.దీంతో ఐదు టిక్కెట్లపై దాదాపు 700 దిర్హామ్‌లను ఆదా చేసాము. ఎయిర్‌లైన్ ఉచిత విమానాశ్రయ షటిల్‌ను కూడా అందించింది." అని పేర్కొన్నారు. మరోవైపు ఎయిర్‌లైన్ ఫుజైరా నుండి మస్కట్ మీదుగా మల్టీ గమ్యస్థానాలకు సరసమైన ధరలకే విమాన సర్వీసులను ప్రారంభించింది. వచ్చే నెల నుండి విమానయాన సంస్థ ఎమిరేట్ నుండి దక్షిణ భారత రాష్ట్రం కేరళలోని కోజిక్కోడ్‌కు Dh361 ప్రమోషనల్ ఛార్జీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com