బహ్రెయిన్‌లో ఐఐటీ మద్రాస్ సర్టిఫికేషన్ కోర్సులు ప్రారంభం
- October 02, 2023
బహ్రెయిన్: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ ప్రవర్తక్ ఫౌండేషన్‌తో ఔట్రీచ్ భాగస్వామి ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు మెక్ఇండిజ్ కన్సల్టెన్సీ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, క్రిప్టో కరెన్సీ, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో విభిన్న శ్రేణి ధృవీకరణ ప్రోగ్రామ్‌లను అందించనున్నట్లు మెక్ఇండిజ్ కన్సల్టెన్సీ వర్గాలు తెలిపాయి. ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో అధికారిక సంతకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోడి, డిజిటల్ స్కిల్స్ అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ మగల సుందర్ పాల్గొన్నారు. మెక్ఇండిజ్ కన్సల్టెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్ పి ఉన్నికృష్ణన్, సీఈఓ అబ్దుల్ జలీల్ అబ్దుల్లా ఉన్నారు. ఇదిలా ఉండగా.. బహ్రెయిన్‌లోని క్రౌన్ ప్లాజాలో జరిగే కార్యక్రమంలో అక్టోబర్ 2న బహ్రెయిన్‌లో పోర్టల్ ప్రారంభించబడుతుంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







